రెవెన్యూ, అటవీ భూ వివాదాలపై సంయుక్త సర్వే : కలెక్టర్ రాజర్షి షా

by Disha Web Desk 1 |
రెవెన్యూ, అటవీ భూ వివాదాలపై సంయుక్త సర్వే : కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్, హవేళిఘనాపూర్ మండలాల్లో అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను సంయుక్తంగా సర్వే చేసి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల పరిష్కారంపై అదనపు కలెక్టర్ రమేష్, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ మండలంలోని ఖాజిపల్లి, బాలానగర్, గుట్టకిందిపల్లి, హవేళిఘనాపూర్ మండలంలోని బూరుగుపల్లి, బొగడ భూపతి పూర్ లోని వివిధ సర్వే నెంబర్లలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను సంయుక్తంగా సర్వే నిర్వహించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పక్కాగా డిమార్కింగ్ చేయాలని సూచించారు.

కాస్తులో ఉన్న లబ్ధిదారులకు పట్టాలిచ్చిన భూమి అటవీ పరిధిలో ఉన్నట్లయితే వాటిపై ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతికై ప్రతిపాదనలు సిద్ధం చేయవలసినదిగా జిల్లా అటవీ శాఖాధికారికి కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఆర్డీవో సాయిరాం, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి మనోజ్ కుమార్, తహసీల్దార్లు శ్రీనివాస్, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed