గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె బాటే..

by Disha Web Desk 20 |
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె బాటే..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 20 తర్వాత సమ్మెలోకి వెళ్తామని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ తునికి మహేష్ అన్నారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాయంలో బుధవారం సమ్మె నోటీస్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.

పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటుగా, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడంతో పాటుగా ప్రమాద భీమా 10 లక్షలు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, జేఎసీ నాయకులు రాజనర్సు, శ్రీకాంత్, రాజమౌళి, పర్మరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed