ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

by Disha Web Desk 1 |
ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
X

దిశ, చేర్యాల: అకాల వర్షం, వడగళ్లతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రైతులకు భరసానిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని రాంపూర్, ఆకునూరు, కొత్త దొమ్మట, గుర్జకుంట, చిట్యాల, తాడుర్, ముస్త్యాల, గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. కురిసిన అకాల వర్షాలకు అనేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. అందుకు రైతులు ఏమాత్రం అధైర్యపడోద్దని సూచించారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.

దెబ్బతిన్న పంటల నివేదికను వ్యవసాయ శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ఆయనతో పాటు ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఏవో ఆఫ్రొజ్, ఏడీఏ రాధిక, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు పెడతాల ఎల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed