బీఆర్ఎస్ విజయం ఖాయం.. : కొప్పుల ఈశ్వర్

by Aamani |
బీఆర్ఎస్ విజయం ఖాయం.. :  కొప్పుల ఈశ్వర్
X

దిశ,గోదావరిఖని : ఒక ఆగర్భ శ్రీమంతుడికి... సామాన్యుడికి మధ్య జరిగిన ఈ పోరులో ప్రజా తీర్పు తన వైపే ఉందని, కాంగ్రెస్ అబద్దాలను ప్రజలు ఓట్లతో తిప్పి కొట్టారని, ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో స్థానికుడిని, సింగరేణి కార్మికుడిని కార్మిక సమస్యలు తెలిసినవాడిగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తనకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని, ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో పాల్గొని కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారని అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నూరులో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, మండలాల, మున్సిపాలిటీ కార్పొరేషన్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజానీకం, కాంట్రాక్ట్ కార్మికులు, వివిధ వర్గాల సంఘటిత, అసంఘటిత కార్మికు,లు ఆటో డ్రైవర్, ఓనర్లు, ప్రతి ఒక్కరు తన గెలుపు కోసం కష్టపడి కృషి చేశారని తెలిపారు. జూన్ 4న జరిగే ఓట్లు లెక్కింపు లో ప్రజా ఆశీర్వాదం తో ఎంపీగా గెలిచినట్లయితే సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ రద్దు కోసం పోరాడుతానని, కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఐదు నెలల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంటే ఇక ఐదేండ్లు ఎలా భరించాలోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటం చేస్తానని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... రామగుండం నియోజకవర్గ ప్రజలు ఒక తాటిపైకి వచ్చి గతంలో చేసిన తప్పును గుర్తించారని, అప్పుడు అనవసరంగా కాంగ్రెస్కు ఓటు వేశామని భావించి ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ నువ్వు గెలిపించేందుకు ప్రజలే ఎంతో ఆరాటంతో ఉన్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story