జనం కోసం.. తపించే నేత హరీష్ రావు : నీలం మధు ముదిరాజ్

by Disha Web Desk 1 |
జనం కోసం.. తపించే నేత హరీష్ రావు : నీలం మధు ముదిరాజ్
X

దిశ, పటాన్ చెరు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పయనిస్తూ.. జనం కోసం పరితపిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెరగని ముద్ర వేస్తూ అనునిత్యం ప్రజా సంక్షేమానికి తపిస్తున్న ఘనత ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంత్రి హరీష్ రావు పుట్టిన రోజును పురస్కరించుకొని నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో చిట్కుల్ గ్రామంలోని గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మొదట శనివారం ఉదయం నీలం మధు హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో హరీష్ రావు ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ అభివృద్ధిలో మంత్రి హరీష్ రావు పాత్ర వెలకట్టలేనిది అన్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి హరీష్ మొక్కవోని పట్టుదల దీక్షతో లక్షల ఎకరాలకు నీరందించేలా భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో ముందుండి నడిచి తెలంగాణ సస్యశ్యామలం కావడంలో ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు.

ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజల సంక్షేమనికి, ఆర్థికాభివృద్ధికి ఉతమిస్తూనే, వైద్య శాఖ మంత్రిగా సర్కార్ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన ఖ్యాతి హరీష్ రావు సొంతమన్నారు. ఈ సందర్భంగా నీలం మధు తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలతో మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన బాటలో నడుస్తూ తాను సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో కవిత, వార్డు సభ్యులు దుర్గయ్య, మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఎన్ఎంఅర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story