- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గన్నీ బ్యాగ్ కొరతతో..రైతుల రాస్తారోకో..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : గన్నీ బ్యాగ్ కొరతతో ధాన్యం కొనుగొళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక పత్తి మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరత మూలంగా కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోందని రైతులు వాపోయ్యారు. ఈయేడు మొగిపురుగు, అకాల వర్షాలతో వరి పంటకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు. చివరకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతుండటంతో ధాన్యం కొంత మేర తడిసి పోయిందని అవేదన వ్యక్తం చేశారు.
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకొని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోకు బీజేపీ నాయకుడు కొత్తపల్లి వేణుగోపాల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా గన్నీ బ్యాగుల సమస్యను పరిష్కరించి కొనుగోలు వేగంగా జరుపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు హుటాహుటిన చేరుకొని గన్నీ బ్యాగులు ఇప్తిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అందోళన విరమించారు.