అల్లాదుర్గంలో మద్యం మత్తులో జోగుతున్న మందుబాబులు..!!

by Disha Web Desk 6 |
అల్లాదుర్గంలో మద్యం మత్తులో జోగుతున్న మందుబాబులు..!!
X

దిశ, అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంది. ప్రతి గ్రామంలో పుట్ట గొడుగుల్లా బెల్టుషాపులు పుట్టుకొస్తున్నాయి. జాతీయ రహదారి 161 ఆనుకొని కొందరు నిర్వాకులు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. అల్లాదుర్గం మండలంలోని భైరన్ దిబ్బ, ఐ బి చౌరస్తా, మాందాపూర్, చిల్వర్, గడి పెద్దాపూర్ గ్రామాల్లో పదులల్లో ఏర్పాటు చేసుకొన్న బెల్ట్ షాపుల్లో మద్యం దందా జోరుగా నడుస్తుంది. అక్రమ బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు నిర్వహకులతో కుమ్మకయ్యారని, లోపాయకారి ఒప్పందం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనునిత్యం బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరపడంతో అతిగా మద్యం సేవించిన కొందరు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఎల్లప్పుడూ దొరికే మద్యంతో యువకులు మత్తుకు బానిసలౌతున్నారు. విచ్చలవిడిగా బెల్టుషాపుల వద్ద సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవడంతో చిన్న చిన్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనునిత్యం పోలీస్ శాఖ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి, పట్టుబడ్డ వ్యక్తులపై కేసు నమోద్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. లోకాయుక్తలో అతి తక్కువ జరిమానాలు చెల్లించి బయటికి వచ్చి భయపడాల్సిన అవసరం లేనట్లుగా మళ్లీ అదే తంతును ఎంచుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు మద్యం అమ్మకాలను పెంచేందుకు వైన్స్ నిర్వాకులు ప్రతీ గ్రామానికి నేరుగా ప్రత్యేక వాహనం (ఆటో ) లో మద్యం రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా ఎక్స్సైజ్ కమిషనర్ స్పందించి ఈ బెల్టుషాపులను నిర్మూలించి, నిర్వాకులపై కఠిన శిక్షలు అమలు పరిచి ప్రజలకు మద్యం మత్తు నుండి విముక్తి కలిగించాలని స్థానికులు కోరారు.



Next Story

Most Viewed