సంగారెడ్డిలో మళ్లీ కుక్కల దాడి

by Sridhar Babu |
సంగారెడ్డిలో మళ్లీ కుక్కల దాడి
X

దిశ, కంది : చిన్నారులపై వీధి కుక్కలు గుంపులుగా దాడులు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితమే సంగారెడ్డి పట్టణం 12వ వార్డులో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయగా పక్కన ఇంట్లో ఉండే వ్యక్తి అరుపులు విని రావడంతో ఆ బాలుడు ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మరువకముందే బుధవారం శాంతినగర్ లో మరో సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న షాజబ్ పాషా అనే మూడేళ్ల చిన్నారిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.

చిన్నారి కేకలు విన్న కాలనీవాసులు వెంటనే కుక్కలను రాళ్లతో కొట్టి తరిమేశారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు తరలించారు. పట్టణంలో చిన్నారులపై కుక్కల దాడుల వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగి తమ చిన్నారుల ప్రాణాలు పోగొట్టుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed