డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి వి సతీష్ మృతి

by Disha Web Desk 12 |
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి వి సతీష్ మృతి
X

దిశ, జహీరాబాద్: డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి వి.సతీష్ ఆదివారం ఉదయం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ మేరకు డిడిఎస్ వర్గాలు పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. జహీరాబాద్ ప్రాంతంలో మహిళల ఆర్థికాభివృద్ధి, స్వావలంబన, విద్యా నైపుణ్యం, పాత పంటల పరిరక్షణ దళిత, గిరిజన మహిళా రైతుల ఆర్థిక అభ్యున్నతికి విశేష సేవలు అందించారు. పాత పంటల పరిరక్షణ కోసం "పాత పంటల జాతర"కు రూపు కల్పన చేసి చిరుధాన్య విప్లవాన్ని సృష్టించారు. డి డి ఎస్ డైరెక్టర్ పి వి సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని డిడి ఎస్ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు స్థానికులు భగవంతుని వేడుకున్నారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయమై విషయమై ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Rajamouli: ఆస్కార్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?


Next Story