నీలం మధు నామినేషన్ కు సీఎం రాక

by Disha Web Desk 15 |
నీలం మధు నామినేషన్ కు సీఎం రాక
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం మెదక్ లో సీఎం రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డితో కలిసి పరిశీలించారు.హెలిప్యాడ్ స్థలంతో పాటు కార్నర్ మీటింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు

చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నీలం మధు నామినేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు మెదక్ వస్తున్నట్టు తెలిపారు. హెలిప్యాడ్, రోడ్డు మార్గం అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కానీ రెండు మార్గాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారని చెప్పారు. ఇన్​ఛార్జి లు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని, ర్యాలీ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇలాఖాలో కాంగ్రెస్ దే విజయం : మంత్రి

మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఇందిరా గాంధీ ప్రధానిగా నిలిచారని మంత్రి సురేఖ అన్నారు. మెదక్ లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని అన్నారు.

బీసీల ఐక్యత చాటుకోవాలి : మైనంపల్లి హన్మంతరావు

మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యత చాటుకోవాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఢిల్లీ వెళ్లేందుకు అవకాశం ప్రజల చేతుల్లో పెట్టిందని, నీలం మధును గెలిపించాల్సిన బాధ్యత బీసీల చేతుల్లో ఉందని అన్నారు. బీసీ ముద్దు బిడ్డ మధు నామినేషన్ కు సీఎం మెదక్ వస్తున్నారని, ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ తప్ప బీసీలను పట్టించుకున్న నాథుడు లేరని,

కానీ ముదిరాజ్ వర్గం అత్యధికంగా ఉన్న మెదక్ పార్లమెంట్ లో ఈసారి మీ సత్తా చాటుకునే అవసరం ఉందన్నారు. నీలం మధు వందల కోట్లు ఖర్చు చేసి సేవ చేస్తున్నారని తెలిపారు. రాజకీయం అంటే బిజినెస్ అయిందని, అమాయక ప్రజలను 2 వేలు ఇచ్చి కొంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ ఎస్ నేతలు పదవి పోయినా ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వారి పాలన నచ్చకే అధికారం నుంచి దించారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బొజ్జ పవన్, జీవన్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఉప్పల రాజేష్, చౌదరి శ్రీనివాస్, గంగా నరేందర్, పబ్బతి ప్రభాకర్ రెడ్డి, సుప్రభాతరావు, భాణి, కౌన్సిలర్ లు లక్ష్మి ముత్యం గౌడ్, వనజ అశోక్, మధుసూధన్ రావు లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story

Most Viewed