ముస్లిం మైనారిటీ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్

by Naresh |   ( Updated:2023-11-20 15:02:07.0  )
ముస్లిం మైనారిటీ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్
X

దిశ, దుబ్బాక: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హాయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏండ్లలో మైనారిటీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత నెల 30న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ అయిన అనంతరం తొలిసారి సోమవారం పట్టణంలో రెడ్డి వేడుక మందిరంలో నిర్వహించిన ముస్లిం మైనారిటీ సోదరుల ఆత్మీయ సమ్మేళనం, నీలకంఠేశ్వర వేడుక మందిరంలో నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ, ల్యాబ్ టెక్నీషియన్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లిం యువతుల వివాహానికి షాదీ ముబారక్, మైనారిటీల అభివృద్ధికి రూ. 1 లక్ష పథకం, మైనారిటీ విద్యార్థులకు సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలను తీసుకువచ్చి, వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ, ల్యాబ్ టెక్నిషియన్లకు శిక్షణ ఇచ్చి, వారికి ధృవ పత్రాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు.

ఆర్ఎంపీ, పీఎంపీలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానన్నారు. గత 9 సంవత్సరాలల్లో మెదక్ ఎంపీగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధికై కారు గుర్తుకు ఓటేసి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఖలీల్, దుబ్బాక పురపాలిక కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఆసిఫ్, తొగుట మండల కో ఆప్షన్ సభ్యులు కలీం బాయి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story