కన్నుల పండువగా వరదరాజ స్వామి రథోత్సవం

by Disha Web Desk 1 |
కన్నుల పండువగా వరదరాజ స్వామి రథోత్సవం
X

దిశ, ములుగు : మర్కుక్ మండలంలోని శ్రీ భూ నీలా సమేత వరదరాజ స్వామి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హోమ పుర్ణవుతి, దిష్టి కుంభంతో పాటు పూజా కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం రథోత్సవం పుర వీధుల్లో వరదరాజ స్వామి ఆలయం నుంచి హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సర్పంచ్ అప్పల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. అదేవిధంగా మండలంలోని వరదరాజ స్వామికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు. కొన్ని రోజుల్లోనే ఆలయ పున:నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగుతాయని అన్నారు.

Next Story

Most Viewed