ధాన్యం దిగుమతిలో జాప్యం ఉండొద్దు

by Sridhar Babu |
ధాన్యం దిగుమతిలో జాప్యం ఉండొద్దు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ధాన్యం దిగుమతిలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి మిల్లర్లకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో 2023-24 సీఎంఆర్ డెలివరీలు, యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...వానాకాలం 2023-24 లో సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ప్రతి రోజూ తమ మిల్లింగ్ కెపాసిటీ అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలన్నారు. అధిక సీఎంఆర్ పెండింగ్ ఉన్న

మిల్లుల నుంచి వేగంగా డెలవరీ చేసే మిల్లర్లకు సొంత ఖర్చులతో ధాన్యం ట్రాన్స్ ఫర్ చేసి సీఎంఆర్ పూర్తి చేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాసంగి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాజీపేట, చెర్లపల్లి ఎఫ్ సీఐ గోదాముల్లో స్థలాభావం సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ను మిల్లర్లు కోరగా ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీనిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీసీఎస్ఓ తనుజ, డీఎం హరీష్, మిల్లర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed