కేతకీ సంగమేశ్వర స్వామి హుండీ లెక్కింపు

by Disha Web Desk 1 |
కేతకీ సంగమేశ్వర స్వామి హుండీ లెక్కింపు
X

46 రోజులకు గాను రూ.33.51 లక్షల ఆదాయం

దిశ, ఝరాసంగం: అష్ట తీర్థాలకు నిలయమైన ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ఈసారి భారీగా పెరిగింది. బుధవారం 46 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 46 రోజులకు గాను రూ.33.51 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకల రూపంలో హుండీ లో వేసిన కానుకలు, నగదు, నాణేలను లెక్కించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ నీల వెంకటేశం,ఆలయ ఈవో శశిధర్, ధర్మకర్తల పర్యవేక్షణలో అర్చక సిబ్బంది, భక్తులు 46 రోజుల ఆలయ లెక్కించగా రూ.33,51,748 లక్షల ఆదాయం వచ్చినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు వెల్లడించారు. వెండి, బంగారు ఆభరణాలను ఆభరణాలను తిరిగి హుండీలో వేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed