- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: కత్తి కార్తీక గౌడ్

దిశ ,దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మెంబర్ కత్తి కార్తీక గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం దుబ్బాక సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్ వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు ఆమె సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ కార్యకర్తలను రెగ్యు లర్ చేసి, రూ.26వేల కనీస వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. 40ఏళ్లుగా పనిచేస్తున్న వీరు కనీస వేతనానికి నోచుకోలేవడం లేదన్నారు. అధికారులు సెంటర్స్ తాళాలు పగులగొట్టి, టీచర్లను హెల్పర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో అంగన్ వాడీలు సమ్మె చేసి గ్రాటుటీ సాధించుకున్న విషయాని గుర్తు చేశారు. అంగన్ వాడీలను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, ఐరేని సాయితేజ, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.