అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

by Naresh N |
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూజల గోపి కృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ వర్థంతి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ కలిమోద్దీన్, నాయకులు మైపాల్ రెడ్డి, కనకయ్య, బిక్షపతి, ఆర్షద్, మున్నా, వాహబ్, అజ్మత్, సలీమ్, పవన్, సాయి ప్రతాప్, మధు, వెంకటేష్.Next Story

Most Viewed