మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు: మహనీయుల ఆశయాల అనుగుణంగా వారి ఇచ్చిన స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు మహనీయుల స్ఫూర్తిని అందించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం. గ్రామ కూడలిలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందచామని ఆయన తెలిపారు.

12న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల తండా, 13న కొల్లూరులో, 14న పటాన చెరు మండలం ఇస్నాపూర్లో సొంత నిధులతో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. 16న బీరంగూడ చౌరస్తాలో మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహావిష్కరణల కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇస్నాపూర్ చౌరస్తాలో చిట్కుల్ వెళ్లే ముఖ ద్వారం వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా పటాన్ చెరు డివిజన్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ఏర్పాటు కోసం జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో 500 గజాల స్థలం కేటాయించామని తెలిపారు. అదేవిధంగా రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరు పొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారి కోసం వారి భాషల్లో చదువుకునేందుకు వీలుగా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

అతి త్వరలోనే నియోజకవర్గంలో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయబోతున్నట్లు తీపి కబురు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ గ్రామ కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed