అదాని కుంభకోణంపై విచారణ జరిపించాలి : సీపీఐ నాయకులు

by Dishanational2 |
అదాని కుంభకోణంపై విచారణ జరిపించాలి : సీపీఐ నాయకులు
X

దిశ,చేర్యాల : అదాని స్టాక్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కోరుతూ.. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీబీ చీఫ్ మేనేజర్ రాంబాబు కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడారు. భారతదేశ కుబేరులైన అదాని స్టాక్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించి కుంభకోణాన్ని వేలికి తీసి ఆ డబ్బును పేద ప్రజలకు డబ్బులు పంపిణీ చేయాలని, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు ఎగవేత చేసిన అదాని, అంబానీ, విజయ్ మాల్యా, లాంటి పెద్ద పెట్టుబడిదారులకు అప్పులు మాఫీ చేశారే తప్ప పేద ప్రజల రుణాలు మాఫీ మాత్రం చేయలేదని విరుచుకపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ దేశ సంపన్నులైన అదాని స్టాక్స్ కుంభకోణంపై పార్లమెంటరీ జెయింట్ కమిటీ ద్వారా విచారణ జరిపించి కుంభకోణాన్ని వెంటనే వెలికి తీయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గూడెపు సుదర్శన్, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పొన్నబోయిన మమత, ఈరి సత్యవ్వ, ముస్త్యాల శంకరయ్య, ఎండీ. షాదుల్ల, శెట్టె అయిలయ్య,పల్లా సీతారామయ్య, ఇరుమల్ల రాజు, కె. నర్సయ్య, బట్ రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed