అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, అందోల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వట్ పల్లి మండల పరిధిలోని మర్వేవెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుకూరి శివశంకర్ (47) శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. ఆయన ఆచూకీ కోసం కుటుంబీకులు అరా తీశారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్ పర్మిట్ రూంలో శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వైన్స్ నిర్వాహకులపై ఆగ్రహ వ్యక్తం చేస్తూ వైన్ షాప్ పై రాళ్లతో దాడికి దిగారు. బోర్డులను ధ్వంసం చేయడంతో పాటు తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు.

మృతదేహాన్ని వైన్స్ ఎదుట ఖననం చేసేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదనికి దిగి మహిళలు కుటుంబీకులతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. జోగిపేట సీఐ నాగరాజు ఎస్సై సామ్యా నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed