Exams:10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. అధికారుల హస్తం ఉందా..?

by Disha Web Desk 3 |
Exams:10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. అధికారుల హస్తం ఉందా..?
X

దిశ వెబ్ డెస్క్: 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. బాధ్యతాయుత విధుల్లో ఉన్న అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు చిట్టీలను అందించేందుకు బయట వ్యక్తుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్, బోధన్ సాలుర మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మాస్ కాపీయింగ్ ఘటన వెలుగు చూసింది.

బయట వ్యక్తులు పరీక్ష కేంద్రాల్లో ప్యూన్ గా మారిన విద్యార్థులకు చిట్టీలు అందిస్తూ భూమేష్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భూమేష్ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. తాను పెట్రోల్ బంకులో పని చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెంటర్ కు సంబంధించిన అధికారులే తనని అపాయింట్ చేశారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. కాపీయింగ్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed