పెళ్లయిన మూడు నెలలకే వివాహిత సూసైడ్

by Rajesh |
పెళ్లయిన మూడు నెలలకే వివాహిత సూసైడ్
X

దిశ, నల్లబెల్లి: పెళ్లయిన మూడు నెలలకే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతుల కూతురు వైష్ణవిని (26) ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రెడ్డి ప్రశాంత్ తో మూడు నెలల క్రితం వివాహం జరిపించారు. అత్తగారింటి వేధింపులు భరించలేక మంగళవారం పుట్టింటికి వచ్చిన వైష్ణవి బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు సమయంలో ఉరి వేసుకుని బల్వత్మారణానకి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed