బ్యాడ్మింటన్ ఆడుతుండగా యువకుడికి గుండెపోటు..

by Disha Web Desk 13 |
బ్యాడ్మింటన్ ఆడుతుండగా యువకుడికి గుండెపోటు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకులు కూడా గుండెపోటుకు బలవుతున్నారు. గత కొద్దిరోజులుగా ఇలాంటి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిమ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, రోడ్డు దాటుతూ ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు యువకులు. హార్ట్ ఎటాక్‌తో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి ఘటనకు మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. సికింద్రాబద్ పరిధిలో మల్కాజ్‌గిరికి చెందిన పరమేష్ యాదవ్ బ్యాడ్మింటన్ ఆడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు.

లాలాపేట్‌లోని ప్రో. జయశంకర్ ఇండోర్ స్టేడియంలో పరమేష్ యాదవ్ అనే 38 ఏళ్ల యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది. సమాచారం అందున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్యామ్ యాదవ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

శ్యామ్ యాదవ్ మృతదేహాన్ని మల్కాజిగిరి లోని అతడి ఇంటికి పోలీసులు తరలించారు. మృతుడు శ్యామ్ యాదవ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ డ్యూటీ అయిన తర్వాత స్టేడియంకు వచ్చి బ్యాడ్మింటన్ ఆడతాడని స్నేహితులు చెబుతున్నారు. శ్యామ్ యాదవ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story

Most Viewed