దళితుల భూములపై అసెంబ్లీలో చర్చ జరగాలి.. తెలంగాణ మాల మహానాడు

by Dishafeatures2 |
దళితుల భూములపై అసెంబ్లీలో చర్చ జరగాలి.. తెలంగాణ మాల మహానాడు
X

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్టంలో దళితులకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సంఘ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్యాక్రాంతంకు గురైన దళితుల అసైన్డ్, ఇనాం, పంచరాయి , ఇతర భూములపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు.

వేల ఎకరాలు దళితుల నుండి గుంజుకున్నారని, వీటిపై న్యాయ విచారణ జరిపి తిరిగి వారికి అప్పజెప్పాలని అయన డిమాండ్ చేసారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు ఎక్కడికెళ్తున్నాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందజేయాలని అన్నారు. దళితుల సమస్యలపై త్వరలో వేలాది మందితో ఛలో హైదరాబాద్ కు పిలుపునిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed