ప్రభుత్వాసుపత్రిలో అన్ని వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

by Disha Web Desk 1 |
ప్రభుత్వాసుపత్రిలో అన్ని వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తానని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్ అక్కడ వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై ఆరాతీశారు. దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియ తిరిగారు. ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కళాశాలకు అప్పగించినందున రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

ప్రతి సోమ, బుధవారాల్లో గర్భిణులు ఏ.ఎన్.సీ పరీక్షలకు రోగుల సంఖ్యతో పాటు లేబొరేటరీ పరీక్షలు, ప్రసవాలు సంఖ్య, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లోనూ రోగుల సంఖ్య అధికమవుతోందని తెలిపారు. అందుకు స్థలం కొరత ఉందని తెలుసుకున్నామని ఆయ తెలిపారు. సరిపడ నర్సింగ్ స్టేషన్లు, డ్రెస్ మార్చుకునే గదులు, నర్సింగ్ కౌంటర్లు లేవని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులకు టీకాలు ఇచ్చే గది ముందు భాగంలోనే ఎక్సరే, స్కానింగ్ రూమ్స్ ఉండటంతో ఇబ్బందిగా ఉందని, ఎక్సరే గది మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు.

కౌంటర్లు, నర్సింగ్ సెంటర్లు, బీరువాలు కావల్సిన వస్తువుల వివరాలను అందజేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని మందలించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ సూపరిండెంట్ డా.సూర్యనారాయణ, డీ.సీ.హెచ్ డా.రమేష్ చంద్ర, ఆర్.ఎం.వోలు దశరథం, బలరాం, అజీమ్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed