తడిసిన ధాన్యం కొని రైతులను ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
తడిసిన ధాన్యం కొని రైతులను ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: అకాల వర్షాల వలన తడిసిపోయిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో, పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆయన అన్నారు.

రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు లాంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుపరచడం లేదన్నారు. రైతుల నుంచే నేరుగా ధాన్యం కోనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు చైతన్యవంతంగా పని చేస్తున్నాయని ఆయన కితాబు ఇచ్చారు.

త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రెండు జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తామని మంత్రి ఉద్గాటించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, పీఏసీఎస్ జిల్లా చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటి చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గణేష్, రాజేశ్వర్ రెడ్డి, దివిటిపల్లి సర్పంచ్ జరీనా, రాజేశ్వర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed