ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి

by Kalyani |
ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి
X

దిశ, మరికల్: నారాయణ పేట జిల్లా మరికల్ మండల పరిధిలోని ఎలిగండ్ల గ్రామానికి చెందిన దాసరి శివ ప్రసాద్ (14)ట్రాక్టర్ నడుపుతూ గ్రామ శివారు నుంచి ఇంటికి వెళుతుండగా ట్రాక్టర్ ను వేగంగా నడపడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి శివ ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story