భర్త కొట్టిండని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భార్య..

by Sumithra |
భర్త కొట్టిండని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భార్య..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చితకబాధడంతో భార్య డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా స్పందించకపోవడంతో మనస్థాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను బాటసారులు కాపాడి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువుగట్టు పై చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని రెండోవార్డు దళిత కాలనీకి చెందిన మాడుగుల ఎల్లమ్మ, పరశురాములు భార్యాభర్తలు కాగా తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చిచ్చురేపి తరచూ గొడవకు కారణమవుతున్నాయని భర్త కొట్టే దెబ్బలు తాళలేక ఎవరికి చెప్పినా పట్టించుకోలేదని చివరికి డయల్ 100 ద్వారా పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయిందని వాపోయింది.

చివరికి తన బిడ్డతో పాటే చావాలనుకున్నా సమయానికి లేకపోవడంతో తాను మాత్రమే చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మినీట్యాంక్ బండ్ కేసరి సముద్రం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో అటుగా వెళుతున్న అనిల్ కుమార్ అనే బాటసారులు మానవత్వంతో వెంటనే కాపాడి ధైర్యం చెప్పి పోలీసులకు అప్పచెప్పారు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకుని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed