తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది:  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల మండల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు సంబరాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కు గ్రామ ముఖద్వారం వద్ద స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మహిళలు బతుకమ్మలతో కోలాటాలతో స్వాగతం పలికారు. గ్రామ రైతులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండి పై ఎమ్మెల్యే ఊరేగింపుగా రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. రైతు వేదిక వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో జోడెడ్లతో నాగలి పట్టి దుక్కి దున్నారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ప్రనిల్ చందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాల పరిపాలన కాలంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత తొమ్మిది ఏళ్లలో జరిగిందని ముఖ్యంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. కేసీఆర్ ముందుచూపుతో రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ విరాజిల్లుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, మెప్మా డిడిఏ రూకియ్య నాయక్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి స్థానిక సర్పంచ్ ప్రనిల్ చందర్, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మండల వ్యవసాయ అధికారి గోపి, గ్రామ ఏవో సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story