అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్ర పరిపాలన : ఎమ్మెల్యే

by Sumithra |
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్ర పరిపాలన : ఎమ్మెల్యే
X

దిశ, కొత్తకోట, మదనపురం : మదనపురం మండలంలోని శంకరమ్మ పేట గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర పాలన కేసీఆర్ సారధ్యంలో జరుగుతుందని అన్నారు. ఈరోజు భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరణ జరుపుకుంటున్నామని అలాగే శంకరమ్మపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోష దాయకమని ఎమ్మెల్యే అన్నారు. దళితుల కొరకు దళిత బంధు స్కీం కింద 100 యూనిట్లు మొదటి విడత ఇచ్చామని, అలాగే రెండో విడతలో నియోజకవర్గంలో 1100 యూనిట్లు దళితులకు ఇచ్చి దళితులను ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

అలాగే కొత్తకోట మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కొత్తకోట తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరే దళితుల బస్సును జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణయ్య, ఎంపీపీ పద్మావతమ్మ, సర్పంచ్ పద్మమ్మ, మార్కెట్ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ నారాయణ, యాదగిరి, రాజ్ కుమార్, కృష్ణయ్య, మన్యం, కృష్ణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story