నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

by Kalyani |
నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
X

దిశ, ఉండవల్లి: దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఢిల్లీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాథo అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలో ఓ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు లో భాగంగా తెలంగాణ విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారు తెలంగాణ అమరవీరులకు మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. అనంతరం అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్, వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్స్ మనోరమ, కరుణశ్రీ, ఎంపీపీలు బీసమ్మ, అశోక్ రెడ్డి, బేగం, వైస్ ఎంపిపి దేవన్న, సర్పంచులు లోకేశ్వర్ రెడ్డి, జయ చంద్రారెడ్డి, హురున్నిసాబేగం, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ సంకాపురం రాముడు, పార్టీ మండలాధ్యక్షుడు రమణ, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed