ఉపాధ్యాయుల నిలయం ఊట్కూర్..

by Disha Web Desk 20 |
ఉపాధ్యాయుల నిలయం ఊట్కూర్..
X

దిశ, ఊట్కూర్ : ఉపాధ్యాయ గురువులకు పుట్టినిల్లుగా ఊట్కూర్ మండలం మారుతుంది. సమాజాన్ని ఉత్తమ బాటలో నడిపే వృత్తిలో ముందుండే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 150 నుండి 170 మంది దాకా ఈ ప్రాంత ఉపాధ్యాయులే ఉన్నారు. వీరందరూ వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. నేటి ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా వారిని తయారు చేయగలిగే వృత్తి కేవలం ఉపాధ్యాయ వృత్తి, డాక్టర్, ఇంజనీర్, లాయర్, పోలీస్, ప్రపంచ మేధస్సు కలిగిన వారిని తయారు చేయాలన్న ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు వ్యవసాయ కుటుంబం, పేద కుటుంబాల నుండి వచ్చేవారే.

మట్టి కష్టాల విలువలు తెలుసుకొని తాము పడ్డ కష్టాలు మరొక విద్యార్థి పడరాదని అవేదనకు గురై మంచి ఉపాధ్యాయుడు అయితేనే వారిని మంచి మార్గంలో పెట్టవచ్చనే కోరికతోనే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు ఉపాధ్యాయులు అంటున్నారు. అన్ని దానాలకన్నా అక్షర దానం ఎంతో గొప్పదని తాము ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషితోనే న్యాయమైన వృత్తిలో ఉన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. నిరక్షరాశులుగా ఉన్న విద్యార్థులను అక్షరాస్తులుగా చేయడమే తమ లక్ష్యం అని, ఈ వృత్తిని తమతోనే అంతం కాకుండా వచ్చే జనరేషన్ విద్యార్థులకు అందించి వారిని ఉత్తమ వృత్తిలో చూడాలనే విధంగా సంకల్ప దృఢత్వంతోనే ముందుకు సాగుతున్నామన్నారు. రిటైర్డ్, ప్రస్తుత ఉపాధ్యాయ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకొని మండలం నుండి యువతీ యువకులు టెట్ పరీక్ష రాసి పెద్ద ఎత్తున క్వాలి ఫై అయి డీఎస్సీ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed