విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్

by Kalyani |
విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు తనిఖీ చేశారు. అలాగే విద్యార్థుల హాజరు, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు బోర్డు పై రాసి విద్యా బోధన చేశారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎస్ఎస్సి లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని అడిగారు. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలు ఎంత వచ్చాయని అడగగా 84% ఉత్తీర్ణులయ్యారని హెడ్మాస్టర్ కలెక్టర్ కు తెలిపారు.

ఈసారి జరిగే ఎస్ఎస్సి పరీక్షల్లో కష్టపడి పనిచేసి 100% మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో మమేకం అయ్యారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రశ్నలు అడిగారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ల ద్వారా శిక్షణ ఎలా పొందాలని అడిగారు. విద్యార్థులకు గుడ్లు తిన్నారా అని అడిగారు. దానికి విద్యార్థులు ప్రతిరోజూ ఇస్తున్నారని తెలిపారు. అనంతరం వంటగదిని పరిశీలించి పరిసరాలు, గార్డెనింగ్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను కలెక్టర్ స్వయంగా సాల్టర్ స్కేల్ ద్వారా పిల్లల బరువు, ఎత్తు పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ ని ప్లాంటేషన్ టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు.

వారం లోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి...

వారం లోపు ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్డిఓ ను ఆదేశించారు. బుధవారం నారాయణపేట ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి ద్వారా స్క్రోటేనింగ్ ప్రాసెసింగ్ ఎలా నిర్వహిస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని చేస్తున్నారని అడిగారు. ఆర్డీవో కార్యాలయంలోనే ఎక్కువ పెండింగ్లో ఉంది. వారంలోపు ధరణికి సంబంధించిన ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకుండా పరిష్కరించాలని ఆర్డీవోను స్పీడ్ అప్ చేయాలని ఆదేశించారు.

Next Story

Most Viewed