ఆ తల్లి బాధ తీరేది ఎలా.. ఆ బిడ్డ నడిచేది ఎలా ..?

by Dishanational2 |
ఆ తల్లి బాధ తీరేది ఎలా.. ఆ బిడ్డ నడిచేది ఎలా ..?
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని బుడ్డ తండా గ్రామానికి చెందిన తండ్రి దాస్య, తల్లి అనితలకు ముగ్గురు సంతానం కూలి నాలి చేసుకుంటూ కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారు. ఉన్నట్టుండి ఏమైందో కానీ మొదటి సంతానం సింధు ఐదు సంవత్సరాల వరకు గ్రామంలోని అందరితో కలిసి పాఠశాలకు వెళ్ళే ది. కాలక్రమేణా ఏమైందో కానీ నడుస్తూ నడుస్తూ కింద పడేదని తల్లిదండ్రులు వాపోయారు. తన బిడ్డను అందరిలాగా చూడాలనుకున్న తల్లిదండ్రులకు బిడ్డకు వచ్చే ఆరోగ్య సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ అప్పులు చేసి వైద్య సదుపాయాలు అందించేందుకు విశ్వ ప్రయత్నం చేశామని, అయినప్పటికీ ఆ బిడ్డ అందరిలా మామూలుగా నడవలేక పోతుందని తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు.



కాలకృత్యాల సైతం..

సింధు కాలకృత్యాలు వెళ్లి తీసుకోలేక పోతోందని, మా శక్తి మీద అప్పు చేసి వైద్యం చేయించినా నయం కావడం లేదని, కుటుంబ జీవనం కోసం ఏ ఇబ్బందికరంగా మారిందని, మా బిడ్డను ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన వైద్యం అందించలేక పోతున్నామని వారు తెలిపారు. కనీసం చేతులు పైకి ఎత్తి అన్నం కూడా తినలేదని, నడవలేక, కదలలేక బిడ్డ బాధలు చూసి ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వారు తెలిపారు.

ప్రభుత్వం, దాతలు సహకరించాలి..

నా బిడ్డ పూర్తి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తోటి విద్యార్థులు బడికి వెళుతున్న తీరును చూసి కంటతడి పెడుతుంది. దిక్కుతోచని స్థితిలో ఏమి చేయలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డకు వచ్చిన ఇబ్బందులు ఏ బిడ్డకు రాకూడదని ఆ దేవుని కోరుతూ.. కావున మా దీనస్థితిని, నా బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని దాతలు ప్రభుత్వం సహకరించాలని ప్రార్థించారు.

Next Story

Most Viewed