లాలూచీ రాజకీయం నేను చేయలేను : సంపత్ కుమార్

by Disha Web Desk 20 |
లాలూచీ రాజకీయం నేను చేయలేను : సంపత్ కుమార్
X

దిశ, అలంపూర్/ అలంపూర్ టౌన్ : సాధారణ ఎన్నికలలో అలంపూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సంపత్ కుమార్ రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి చంద్రకళకు అందజేశారు. మొదటి సెట్ దీపక్, చారి, రెండవ సెట్ ను నాగేశ్వర్ రెడ్డి సిరాజ్, జాగన్మోహన్ నాయుడు, గోపాల్ తో కలిసి సంపత్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం హరిత హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడారు. అలంపూర్ ప్రజలే నా బలమని, వారి తీర్పును శిరసావహిస్తా అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ తన ప్రచారాన్ని గ్రామగ్రామాన చేస్తున్నానని, తనకున్న రాజకీయ అనుభవం, తాను నేర్చుకున్న పాఠాలతో ఆలంపూర్ ప్రజలు నన్ను మరొకసారి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదవుల కోసం ఆస్తుల కోసం.. తల్లి లాంటి పార్టీని దూరం చేసుకోనని, అలాంటి లాలూచ రాజకీయం పార్టీ మారిన వ్యక్తులకే తగునని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతించుటకు సిద్ధంగా ఉన్నామని, పార్టీ అధిష్టానం మేరకు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మాకు ప్రధాన అస్త్రమని, మేము ఇస్తున్న ఆరు గ్యారెంటీల హామీనే ప్రజల్లో తీసుకెళ్లి గెలుస్తామని నిజమా వ్యక్తం చేశారు. 2009లో కూడా సోనియమ్మ నేరుగా టికెట్ ఇస్తే.. ఇక్కడ ఉన్న బడా నాయకులు బీఫాంలో ఇవ్వకుండా అడ్డుపడ్డారని.. 2014లో కూడా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనకు టికెట్ ఇచ్చిందని.. ఎవరి దయా దాక్షిణలతో టికెట్టు నాకు రాలేదని చెప్పుకొచ్చారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసే గుణం వారికే ఉంటుందని బహిరంగంగా ఆరోపించారు. ఏది ఏమైనా అలంపూర్ ప్రజలను తాను నమ్ముకున్నానని... తనకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.



Next Story