కలుషిత నీరు సరఫరాను నిరోధించండి : జిల్లా కలెక్టర్

by Aamani |
కలుషిత నీరు సరఫరాను నిరోధించండి :  జిల్లా కలెక్టర్
X

దిశ,వనపర్తి : వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగు నీరు కలుషితం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మిషన్ భగీరథ అధికారులు,ఏ. ఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామాల్లో లీకేజీ కారణంగా వర్షపు మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతిని తాగు నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుందని అలాంటి వాటిని ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేస్తూ శుభ్రమైన నీటిని సరఫరా చేయాలని సూచించారు.అవసరమైన మోతాదులో క్లోరినేషన్ చేయడం ఎప్పటికప్పుడు పైప్ లైన్ లు చెక్ చేస్తూ ఉండటం జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్. ఈ.జగన్మోహన్,ఈఈ మేఘా రెడ్డి, ఎ. ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story