అచ్చంపేట అభివృద్ధి నా లక్ష్యం ఎంపీ : మల్లు రవి

by Aamani |
అచ్చంపేట అభివృద్ధి నా లక్ష్యం  ఎంపీ : మల్లు రవి
X

దిశ,అచ్చంపేట : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీ డాక్టర్ మల్లు రవి మొదటిసారిగా అచ్చంపేట ప్రాంతానికి వచ్చారు. ఎంపీ మల్లు రవికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మన స్వాగతం పలికి అక్కడనుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అచ్చంపేట ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అచ్చంపేట అభివృద్ధి లక్ష్యంగా నిత్యం మీకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటానన్నారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు చెల్లించి పోయిన ఆనాడు చేయించి పోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ అమలవుతుందని, అలాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు మరికొంతమంది అవుతారన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీకి సంక్షేమ పథకాలు జరుగుతాయని, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని అత్యధికంగా అచ్చంపేట ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చారని అందుకు అచ్చంపేట ప్రజలకు ఏం చేసిన తక్కువే నన్నారు. కెసిఆర్ నియంత పాలనకు ప్రజలందరూ తగిన గుణపాఠం బుద్ధి చెప్పారని కాబోయే రోజుల్లో అందరూ ఆ పార్టీ నాయకులు ఊసలు లెక్కబెట్టడం ఖాయమన్నారు.Next Story

Most Viewed