మక్తల్ లో సివిల్, క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

by Kalyani |
మక్తల్ లో సివిల్, క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
X

దిశ, మక్తల్: మక్తల్ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్- జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సివిల్ క్రిమినల్ ఏర్పాటు చేస్తూ జిఓఎం ఎస్ నం.41 జులై 102024 తేదిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. గత ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గ ప్రజలకు కోర్టు ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన మూడవ హమి నెరవేరిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి, లేఖ ఆర్ఓసి నం 321/ఈ1/2022,23.12.2022. ప్రకారం… హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నారాయణపేట జిల్లా మక్తల్లో ఫస్ట్‌క్లాస్ కోర్టుజూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సిబ్బందిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా… ప్రతిపాదన పట్టించుకునేవారు లేకపోవడంతో కోర్టు ఏర్పాటు పెండింగ్లో పడిందని, తను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ లో ఫైలును కదపడంతో కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సిబ్బంది కేటాయింపుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో కోర్టుని ప్రారంభం చేస్తామన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చానన్న సంతోషం జీవితంలో గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.

Next Story

Most Viewed