కబ్జా కోరు చెరలో 'చెరువు'.. కన్నెత్తి చూడని అధికారులు

by Dishanational4 |
కబ్జా కోరు చెరలో చెరువు.. కన్నెత్తి చూడని అధికారులు
X

దిశ, కల్వకుర్తి: చెరువు కబ్జాకోరుల చెరలో చిక్కుకుంది మహాప్రభో విడిపించండి అంటూ అధికారులకు పలువురు విజ్ఞప్తులు చేసిన తమకు ఏమి పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కబ్జా జరిగింది వాస్తవం. చెరువు కలుషితమవుతున్నది నిజం అని తెలిసిన.. అధికారులు తమకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా ఉంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణంలోని నాగర్ కర్నూల్ జిల్లా రహదారి పక్కన 754 /3ఆ/1 సర్వే‌లో నెంబర్ పురాతన కుమ్మరి కుంట చెరువు ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించి ఉన్న కుమ్మరి కుంట చెరువు కావడంతో అధికారుల నిఘా కరువైంది. గతంలో పంట చేళ్లకు అవసరమైన నీరు లభించడంతో పాటు.. జీవరాశికి సాగునీరు కూడా అందేది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ చెరువుపై కబ్జా కారులు దృష్టి సారించారు. ముందుగా చెరువుకు సమీపంలో ఉన్న పంట పొలాలను కల్వకుర్తిలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఓ పారిశ్రామికవేత్త బాబు కొనుగోలు చేశాడు.

కొనుగోలు చేసిన భూమి వరకు ఫెన్సింగ్, లేదా ప్రహరీ గోడను నిర్మించాలి. కానీ, ఆ పారిశ్రామికవేత్త అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుని పారాబైల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేశాడు. రాజకీయంగా, ఆర్థికంగా తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని పనుకున్న పొలానికి సమీపంలో ఉన్న చెరువు భూమిని దాదాపు అర ఎకరానికి పైగా ఆక్రమించాడు. దీంతో పారా బాయిల్డ్ రైస్ మిల్ నుండి వెలువడే వ్యర్థ పదార్థాల నీటినన్నింటిని చెరువులోకి వదిలేశారు. 5 మాసాల క్రిందట ఈ విషయమై యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్, ఇరిగేషన్ శాఖలకు ఫిర్యాదులు చేసినప్పటికీ తమకు ఏమీ పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం " దిశ " దినపత్రికలో ఈ సంవత్సరం జనవరి నెల 6 తేదీన " కబ్జా కోరల్లో.. కుమ్మరి చెరువు అనే కథనం ప్రచురితమైంది. ఈ నెల 5న మరికొన్ని ఇతర మీడియాలలోనూ కథనాలు వచ్చాయి.

ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కబ్జాను నివారించవలసించలేక తమకు ఏమి పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌ను యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది. నెలలు గడుస్తున్న సర్కారు అధికారుల చర్యలు మాత్రం శూన్యం. అధికారుల నిర్లక్ష్యమా..? ఫ్యాక్టరీ యజమానితో అధికారులుకున్నా సమన్వయమా..? అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ప్రజా ప్రతినిధుల ఒత్తిడిలకు తలొగ్గకుండా కుమ్మరి కుంట చెరువును కాపాడాలని పలువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed