బీజేపీ, బీఆర్ఎస్ హాయాంలో అభివృద్ధి శూన్యం : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీ, బీఆర్ఎస్ హాయాంలో అభివృద్ధి శూన్యం : వంశీచంద్ రెడ్డి
X

దిశ, మిడ్జిల్ : పాలమూరు జిల్లాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకుండా ఆగం చేశారని, పాలమూరు జిల్లా ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ 400 చేసి, ఉపాధి హామీలో వందరోజుల పనిదినాలను 150 రోజులకు పెంచుతామన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం కుర్వ, గడ్డపల్లి, మీనాంబరం శివాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.

మండలంలోని బైరంపల్లి, కంచన్ పల్లి, దోనూరు, సింగం దొడ్డి, పస్పుల, వల్లభరావు పల్లి, రాణి పేట, కొత్తపల్లి గ్రామాల్లోని కార్యకర్తలు డప్పులతో స్వాగతం పలికారు. అనంతరం అన్ని గ్రామాల్లో మీటింగ్ లు నిర్వహించి మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్త మాటలు చెప్పి గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పి ఓట్లు అడగాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డీకే అరుణను డిమాండ్ చేశారు.

అవినీతి అక్రమాలతో ప్రజలను ప్రాంతాన్ని దోపిడి చేసి మరిన్ని ఆస్తులు కూడా పెట్టుకునేందుకు పాలమూరుకు వచ్చిన డీకే అరుణ ను ఎన్నికల్లో ప్రజలందరూ ఓడించి తగిన బుద్ధి చెప్పాలని వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 15లోపు ఎట్టి పరిస్థితుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని అనిరుద్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మిడ్జిల్ మండల నాయకులు, జడ్చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ దీపా గోపాల్ రెడ్డి, ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ బెక్కరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed