ఆర్టీసీ స్థలంలో షెడ్ల నిర్మాణానికి సన్నద్ధమైన మున్సిపల్ అధికారులు.. అడ్డుకున్న ఆర్టీసీ ఆర్ఎం, సిబ్బంది

by Disha Web Desk 11 |
ఆర్టీసీ స్థలంలో షెడ్ల నిర్మాణానికి సన్నద్ధమైన మున్సిపల్ అధికారులు.. అడ్డుకున్న ఆర్టీసీ ఆర్ఎం, సిబ్బంది
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో వ్యాపార సముదాయాల నిర్మాణం కోసం మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన సిబ్బందిని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో, సిబ్బంది, కార్మికులు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడంతో వారి స్థలం నుండి ఆర్టీసీ సంస్థ పరిధిలో ఉన్న స్థలంలో షెడ్ల నిర్మాణానికి ఆర్టీసీ అనుమతులు లేకుండానే శంకుస్థాపనతో, మార్కింగ్ చేసి ముగ్గు వేయడానికి సన్నద్ధం అయ్యారు.

విషయం తెలుసుకున్న ఆర్ఎం శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది ఆర్టీసీ ఎండి అనుమతులు లేకుండా తమ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ, మున్సిపల్ అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆర్ఎం శ్రీదేవి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కొందరు ఆర్ఎంపై 'నోరు మూసుకో ' అంటూ దురుసుగా వ్యాఖ్యానాలు చేయడంతో, ఆర్టీసీ సిబ్బంది అదే స్థాయిలో ధ్వజమెత్తారు. హోరా హోరీ నినాదాలతో బస్టాండ్ దద్దరిల్లింది. ఆర్టీసీ బస్టాండ్ లో గొడవ జరుగుతున్న నేపథ్యంలో జనం పెద్ద ఎత్తున రావడంతో మున్సిపల్ చైర్మన్, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.



Next Story

Most Viewed