క్రీడలతో మానసికోల్లాసం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
క్రీడలతో మానసికోల్లాసం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: క్రీడలు శరీరానికి మానసికోల్లాసానికి తోడ్పడతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాల కృష్ణయ్య క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీఎం క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలు ఆడడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే మనస్తత్వం అలవడుతుందని అన్నారు.

గెలుపోటములు క్రీడల్లో సహజమని, గెలిచినవారు ఓడిన వారిని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పలుసు రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి జిల్లా క్రీడల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఆయా మండలాల ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు తదితరలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed