నల్లమట్టి తరలింపు అక్రమం కాదు.. మక్తల్ ఎమ్మెల్యే

by Disha Web Desk 20 |
నల్లమట్టి తరలింపు అక్రమం కాదు.. మక్తల్ ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్ : మక్తల్ చెరువు నుండి అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్నారన్నా దానిలో నిజం లేదని నల్లమట్టిని కలెక్టర్ పర్మిషన్తో తరలించడం వల్ల నియోజకవర్గం నుండి దాదాపు 50 లక్షల రూపాయలు ఖజానాకు జమ అయ్యావని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ కింద ఎంపిక కావడంతో బోటు విహారంకు చెరువులోతు ఉండాలని నిర్ణయించారన్నారు. దానికోసమే ఉద్దేశించిన మేరకు లక్ష 75 క్యూబిక్ మీటర్ల నల్ల మట్టిని తీయాలని టెక్నికల్ అంచనాలతో చెరువులోతును పెంచుతూ నల్ల మట్టి పూడిక తీసివేయాలన్నాన్నారు. ఈ పనులు చేయించేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. కాని అకాల వర్షాలతో పూడికలు తీయడం నిలిచిపోయిందని ఇప్పుడు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసినా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయాలన్న ఉద్దేశంతోనే చెరువుల నుండి అక్రమంగా నల్లమట్టి తరలిస్తూ అధికార పార్టీ నాయకులు అక్రమ సంపాదనకు తెరలేపుతున్నారని గగ్గోలు పెడుతున్నారన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 సంవత్సరంలో చెరువులో నీటి నిలువ సామర్థ్యం పెంచి చెరువు కింద ఆయకట్టును పెంచాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి పూడిక తీసివేత పనులను చేపట్టాలని ఆదేశించిందన్నారు. అందులో భాగంగా మక్తల్లో చెరువుల పూడిక తీతకు నిధులు మంజూరయ్యాయని, అకాల వర్షాల వల్ల పను పనులు మధ్యలో నిలిచిపోయాయన్నారు. ఈ సంవత్స రం వర్షాకాలం రాకముందే పూడికతీత చేపట్టాలన్నారు. రైతులు నల్లమట్టిని ఉచితంగా తీసుకెళ్లాలని నిబంధనలు ఉన్నా కమర్షియల్ పరంగా అయితే నల్లమట్టి తరలింపునకు నిర్ణయించిన రేటు చెల్లించి కలెక్టర్ పర్మిషన్తో మట్టిని తరలించడం వల్ల ఖజానాకు మక్తల్ నియోజకవర్గం నుండే అరకోటి రూపాయలు జమయ్యావని ఆయన తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రతిపక్ష పార్టీలకు తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించే రకంగా లేనిపోని ఆరోపణలు చేయడం తగదని నిజాలు తెలుసుకోవాలని ఆయన తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed