భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందిద్దాం: Minister Niranjan Reddy

by Disha Web Desk 11 |
భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందిద్దాం: Minister Niranjan Reddy
X

దిశ, వనపర్తి: ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు భాగస్వాములవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పోడు భూముల పట్టా పాస్ పుస్తకాలను గిరిజనులకు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ పద్దతితో పోడు భూముల ప్రక్రియ పూర్తీ చేసి పేద గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఖిల్లా ఘణపురం జడ్పీటీసీ కృష్ణ నాయక్, గిరిజన నాయకులు శేఖర్ నాయక్, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More : విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం : Narsapur MLA Chilumula Madan Reddy

Next Story

Most Viewed