టూరిజం స్పాట్ గా కొల్లాపూర్ : కేంద్ర మంత్రి

by Kalyani |
టూరిజం స్పాట్ గా కొల్లాపూర్ : కేంద్ర మంత్రి
X

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన వెంటనే తాను ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చానని, కానీ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో దోపిడీ చేసినందుకే ప్రాజెక్టు నష్టం వాటిల్లిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి ఆరోపించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరివర్తన సభలో పాల్గొని మాట్లాడారు. ముందుగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం సభలో మాట్లాడారు. కొల్లాపూర్ ప్రాంతానికి జాతీయ రహదారి తో పాటు సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జ్ తీగల వంతెన నిర్మాణం కూడా జరిగిపోతుందని, త్వరలో కొల్లాపూర్ ప్రాంతం టూరిజం స్పాట్ గా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. జోగులాంబ శక్తిపీఠం మీదుగా సంగమేశ్వరాలయం, సోమేశ్వర ఆలయం వంటి ప్రధాన ఆలయాలకు యాత్రికులు పాదయాత్రగా వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే 450 కోట్ల నిధులతో జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కావచ్చిందని, తీగల వంతెన నిర్మాణానికి సైతం టెండర్లు పిలిచామని, త్వరలో భూమి పూజ కూడా ప్రారంభం అవుతుందన్నారు దానికి ఈ ప్రాంతానికి మళ్ళీ మరోసారి వస్తానంటూ పేర్కొన్నారు. కానీ తాము బలపరిచిన అభ్యర్థి సుధాకర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రైతులకు మేలు చేసే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్రం మంత్రి పోన్ను రాధాకృష్ణ ,శ్రీనివాస్ యాదవ్, సింగోటం రామన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్ చంద్ర, శేఖర్ గౌడ్ , రోజా రమణి,మునిస్వామి పెబ్బేటి మల్లేష్, కాశిపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story