జడ్చర్ల పిఎసిఎస్ సీఈఓ యాదగిరి సస్పెండ్

by Kalyani |
జడ్చర్ల పిఎసిఎస్ సీఈఓ యాదగిరి సస్పెండ్
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పిఎసిఎస్ సీఈవో యాదగిరి పై ఫర్టిలైజర్ పంపిణీలోరూ. 3,37,000 రూపాయల అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ నిమిత్తం జడ్చర్ల పి ఎస్ ఎస్ పాలక మండలి సీఈఓ యాదగిరిని సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసినట్టు పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ తెలిపారు. బుధవారం జడ్చర్ల పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇటీవల నాబార్డ్ రుణంతో గోదాం నిర్మాణం విషయంలో అవినీతి జరిగినట్లు కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని అన్నారు.

గోదాం నిర్మించాక నాబార్డ్ అధికారులు ఆడిట్ చేశాక ఎంబి లెక్కల ప్రకారం నిర్మించిన గోదాం పనులకు నాబార్డ్ రుణం ఇచ్చారని తెలిపారు. నాబార్డ్ రుణం దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని అలా నిరూపిస్తే వాటికి తానే స్వయంగా బాధ్యత వహిస్తానని సుదర్శన్ గౌడ్ అన్నారు. అసత్య ఆరోపణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని అలాంటి వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని సుదర్శన్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed