ఓట్ల కోసమే జనాకర్షక పథకాలు తెస్తున్న కేసీఆర్ - Janampalli Anirudh Reddy

by Disha Web Desk 11 |
ఓట్ల కోసమే జనాకర్షక పథకాలు తెస్తున్న కేసీఆర్ - Janampalli Anirudh Reddy
X

దిశ,మిడ్జిల్ : ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే , ప్రస్తుతం జనకర్షక పథకాలను ప్రకటిస్తూ,ఓట్ల కోసం కేసీఆర్ సర్కారు మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టి పి సి సి ప్రధాన కార్యదర్శి జానంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం లో చేపడుతున్న ప్రజాహిత పాదయాత్ర 23వ రోజు న శనివారం మిడ్జిల్ మండలంలోని అయ్యవారి పల్లి నుండి చిల్వేర్,రెడ్డి గూడ, కొత్తపల్లి , గ్రామల్లో కొనసాగింది. ఇందులో భాగంగా అనిరుద్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ , వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలను కలుస్తూ యాత్ర కొనసాగించారు.

ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యలు మితిమిరిపోయాయని ప్రజలు బీఆర్ఎస్ కు చరమగీతం పడేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ,వంట గ్యాస్ ధరలు రూ.500కు తగ్గిస్తామని,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని,రాష్టంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, నిరుద్యో గులకు భృతి కల్పిస్తామన్నారు.

సీఎం కేసీఆర్ పేదలకు కట్టిస్తానన్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టివ్వలేదని నిలదీశారు. దళితులకు మూడెకరాల భూమి,రాష్టంలో ప్రతి ఇంటికి దళిత బంధు ఇవ్వడంతో పాటు బీసీ లకు బీసీ బంధు, గిరిజనులకు గిరిజన బంధు,మైనారిటీ బంధు పథకాలు ప్రకటించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం కేసిర్ ఎన్నికల బరిలో నుండి తప్పు కోవాలని అన్నారు.అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో గిరిజన, మైనారిటీ రిజర్వేషన్ల శాతం ఎందుకు పెంచలేదని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలు కరెంటు ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ విధాన పరమైన ప్రకటన ఇవ్వనున్నదని తెలిపారు.దీనిపై రైతులు అపోహలు చెందవొద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ మహమ్మద్ గౌస్ రబ్బానీ, మండల అధ్యక్షుడు అల్వాల్ స్థానిక ఎంపీటీసీ రాజారెడ్డి డీసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్,స్థానిక ఉపసర్పంచ్ మల్లయ్య, ఎంపీటీసీలు ఎండి గౌస్, నరసింహ, ఉపసర్పంచ్ జంగయ్య, సత్యం గౌడ్, రాణిపేట గ్రామ అధ్యక్షుడు మల్లేష్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, వెంకట్ రెడ్డి ,పర్వతాలు ,జహంగీర్, హరి గౌడ్,కృష్ణయ్య, ,వెంకటేష్ గౌడ్, రాములు, ప్రేమ్ రాజ్, కృష్ణ యాదవ్, చెన్నయ్య, గౌస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed