దాడులు కొనసాగితే ప్రజలే ప్రతిదాడి చేస్తారు: మంత్రులు Srinivas goud , Singireddy Niranjan Reddy

by Disha Web Desk 11 |
దాడులు కొనసాగితే ప్రజలే ప్రతిదాడి చేస్తారు: మంత్రులు Srinivas goud , Singireddy Niranjan Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారనీ, ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇక ప్రజలే ప్రతిదాడి చేస్తారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశానికి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో అవినీతిపరులు, పలు కేసులు ఉన్నవారు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, వారిపై ఈడీ దాడులు చేయకుండా తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ఏమిటని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాజకీయల్లో ఓట్లతో గెలవాలి కానీ ఇలా దాడులతో కాదని పేర్కొన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, మిషన్ భగీరథ ప్రాజెక్టు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన అవార్డులే అందుకు తార్కాణం అన్నారు. ఇక్కడ జరుగుతున్నఅభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని, తెలంగాణ సమాజం ఈ దాడులను చూస్తూఊరుకోదని స్పష్టం చేశారు.

కృష్ణా జలాల వాటా తేల్చకుండా కాలయాపన చేస్తారా : మంత్రి నిరంజన్ రెడ్డి

కృష్ణానదీ జలాల వాటా తేల్చకుండా కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని, దానికి తోడు పలువురు కాంగ్రెస్ నాయకులు వివిధ కేసులు వేశారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని చెప్పారు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగడంలేదని ఆయా రాష్ట్రాల ప్రజలే అంటున్నారనిమంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వచ్చే యాసంగిలో సాధ్యమైనంతవరకు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండే వేరుశనగకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని ఆ పంట సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్ 4న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆ పర్యటనను విజయవంతం చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరం కలిసి కృషిచేస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆలవెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి,మర్రి జనార్దన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed