హంగులేదు టింగు లేదు రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
హంగులేదు టింగు లేదు రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : హంగు లేదు టింగు లేదు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ చేసిన హంగ్ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శనివారం జడ్చర్ల సమీపంలోని, నాగసాల వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గోదామును జడ్చర్ల పిఎసిఎస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైట్రిక్ కొట్టబోతుందని ఈ అంశాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రజలను, నాయకులను అయోమయానికి గురి చేసే పథకంలో భాగంగానే రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని ప్రభుత్వ ఏర్పాటులో తామెకీలకం కాబోతున్నామని ప్రతిపక్షాలు కొత్త డ్రామాలు మొదలుపెట్టాయని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి గోదాములు పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి పంటల విస్తీర్ణం పెరిగిందని దీని వల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులకు ఉండిందని అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామర్ధ్యాన్ని 70 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకెళ్లామని తెలిపారు. మార్కెటింగ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తో పాటు సహకార సంఘాలు బలోపేతం అయినందున రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా సైతం గౌదముల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, ఎందుకు నాబార్డ్ తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుందని ప్రశ్నించారు.

ఇందులో భాగంగానే జడ్చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ గోదాం నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీనివల్ల ఈ ప్రాంత రైతులకు వారు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పండించిన పంటలు ఎక్కడికక్కడే నిల్వ చేసేందుకు సాధ్యమైనంత దగ్గరలో 2500 మెట్లు సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మిస్తున్నామని ఇది రైతులకు ఒక మంచి వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, డిసిసిబి అధ్యక్షులు నిజాం పాషా, జడ్చర్ల పిఎస్పీఎస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షులు వాల్య నాయ, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీలు చందర్,రైతుబంధు అధ్యక్షులు జంగయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్ రెడ్డి, చైతన్య, చౌహన్, లత, నవనిత, రమేష్, మహేష్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ అధ్యక్షుడు కుమార్ నాయకులు, శంకర్ నాయక్, ఎన్టీఆర్ ఖాన్, శ్రీకాంత్, కాజా అలీముద్దీన్, డైరెక్టర్లు ,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed