ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

by Dishafeatures2 |
ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
X

దిశ, ఇటిక్యాల: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం మండలపరిధిలోని కోదండపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందజేస్తామని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.

దళితులకు మూడెకరాల భూమి లేదు నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు.. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ మాత్రమే చేయలేదని మండిపడ్డారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. తన హామీని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ అవినీతి పాలన అంతమొందించే సమయం దగ్గరలోనే ఉందని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచ్ రవి, కోదండపురం నరసింహుడు, ధర్మవరం నారాయణ నాయుడు, వెంకటేష్ రుక్మందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed