భౌగోళిక తెలంగాణ వచ్చినా బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛకు భంగం.. భట్టి విక్రమార్క

by Disha Web Desk 20 |
భౌగోళిక తెలంగాణ వచ్చినా బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛకు భంగం.. భట్టి విక్రమార్క
X

దిశ, బల్మూరు/అచ్చంపేట : కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి పై సామాజిక వర్గాలకు అన్యాయం చేసి, ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన మహాగనుడు ముఖ్యమంత్రి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా జిల్లాలోని బల్మూరు మండలం లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నం తప్పా, ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వాతంత్రం, భావ స్వేచ్ఛను బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అమ్మ హస్తం పథకం కూడా అందరిని దుస్థితి కేసిఆర్ పాలనలో నెలకొన్నదని ప్రభుత్వంపై ద్వజమెత్తారు. దళిత బందుకు రూ. 17,700 కోట్ల బడ్జెట్లో పెట్టి, ఏడాది పూర్తయిన నిధులు విడుదల చేయకుండా చట్టసభను అవమానించిన సీఎం అని అభివర్ణించాడు. ధనిక రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోత ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, ప్రగతిశీల వాదులు ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు ఏంటి? ఈ పదేండ్ల కాలంలో సాధించిన లక్ష్యాలు ఏంటి? అన్నదానిపై చర్చ జరపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజల సిద్ధమయ్యారన్నారు. అమెరికాకు వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ 100 సీట్లలో గెలుస్తుందని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. తనతోపాటు టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకటరెడ్డి స్థానిక నాయకులు ఉన్నారు.


Next Story